బీజింగ్: నేరస్తుల మార్పిడికి సంబంధించి హాంగ్‌కాంగ్ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు పట్ల పశ్చిమ దేశాల ప్రోద్బలంతో హాంగ్‌కాంగ్‌లో కొందరు నానా యాగీ చేస్తున్నారు. పశ్చిమ దేశాల మీడియా దీనిని గోరంతలు కొండంతలుగా చేసి హాంగ్‌కాంగ్‌లో ఏదో జరిగిపోతుందన్నట్లుగా ప్రచారం చేస్తున్నది. ఒక దేశం రెండు వ్యవస్థలు విధానం అమలవుతున్న చైనాలో హాంగ్‌కాంగ్‌లో నేరస్తులను చైనాకు బదలాయించేందుకు వీలుగా ఈ బిల్లును హాంగ్ కాంగ్ ప్రభుత్వం ప్రతిపాదించింది. నిందితులను చైనాకు అప్పగించడమే మేలంటూ మెజారిటీ పౌరులు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా, తమ హక్కులకు భంగం వాటిల్లే ప్రమాదముందని పశ్చిమదేశాల మద్దతు ఉన్న కొందరు వాదిస్తున్నారు.
నేరస్తుల మార్పిడి బిల్లుపై హాంగ్‌కాంగ్‌లో నిరసనలు
