- 21 మంది మృతి
జుడా: పరిమితికి మించిన ప్రయాణీకులతో వెళ్తున్న ఓ బుల్లి వాణిజ్య విమానం దక్షిణ సూడాన్‌లోని ఒక సరస్సులో కుప్పకూలిపోవటంతో అందులోని 21 మంది మరణించినట్లు స్థానిక అధికారులు చెప్పారు. 19 సీట్ల సామర్ధ్యం కలిగిన ఈ విమానం జుబా నుండి యిరోల్ పట్టణానికి ప్రయాణించే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని ద.సూడాన్ సమాచార శాఖ మంత్రి తబన్ అబెల్ అగువెక్ చెప్పారు. ఈ ప్రమాద కారణంపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం నుండి ఆరేళ్ల చిన్నారితో సహా ముగ్గురు బతికి బయటపడ్డారని ఆయన వివరించారు. ప్రమాదం జరిగిన యిరాట్ ప్రాంతం దక్షిణ సూడాన్‌లో అంతర్యుద్ధానికి కేంద్రంగా వుంది.
దక్షిణ సూడాన్‌లో కుప్పకూలిన విమానం
