వాషింగ్టన్ : అమెరికాలోని సోషలిస్టు ఈక్వాలిటీ పార్టీ (ఎస్ఇపి) ఐదవ మహాసభ గత నెల 22-27 తేదీల్లో మిచిగన్‌లో జరిగింది. ''పెరిగిన వర్గ పోరాటాలు- సోషలిస్టు ఈక్వాలిటీ పార్టీ కర్తవ్యాలు'' అనే అంశంపై మహాసభలో ప్రధానంగా చర్చ సాగింది. నాలుగు రోజుల పాటు చర్చ జరిగిన తర్వాత ముసాయిదాను సవరించాలని కోరుతూ వచ్చిన ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. వికీలీక్స్ చీఫ్ జూలియన్ అసాంజెపై వేధింపులను ఖండిస్తూ మహాసభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఆయన విడుదల కోరుతూ అంతర్జాతీయంగా ప్రచారం చేపట్టాలని పిలుపిచ్చింది. ఎస్ఇపి కొత్త జాతీయ కమిటీని మహాసభ ఎన్నుకుంది. డేవిడ్ నార్త్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నుకున్నారు.
సోషలిస్టు ఈక్వాలిటీ పార్టీ జాతీయ అధ్యక్షునిగా డేవిడ్ నార్త్
