ఖాట్మండు : నేపాల్లో సంభవించిన భూకంపం నష్టాల వల్ల 66 లక్షల మంది ప్రభావితులైనట్లు ఖాట్మండులోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం ఆదివారం ప్రకటించింది. సహాయక కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నట్లు తెలిపింది. రుతుపవన వర్షాల వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొంది. ఈ విషాదకర విపత్తు నుంచి తేరుకునేందుకు నేపాల్ ప్రభుత్వానికి తాము అన్ని విధాలా సహకరిస్తామని ఐరాస రెసిడెంట్ కోఆర్డినేటర్ జామై మెక్గోల్డ్డ్రిక్ తెలిపారు. శిథిలాల కింద ప్రాణాలతో ఉన్నవారిని రక్షించడమే తమ ముందున్న కర్తవ్యంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు.
66 లక్షల మందిపై ప్రభావం : ఐరాస
