రెడ్‌ జోన్లలో ఆంక్షలు కఠినం జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఆయా ప్రాంతాలను రెడ్‌జోన్లుగా ప్రకటించడంతో ప్రజలను పూర్తిగా ఇళ్లకే పరిమితం చేశారు. వారికి కావాల్సిన సరుకులు, ఇతర ప్రభుత్వ లబ్ధిని నేరుగా ఇళ్లకు తీసుకెళ్లి అందిస్తున్నారు. వాలంటీర్లు, ఆరోగ్య సిబ్బంది నిత్యం ఇంటింటికీ తిరుగుతూ సర్వే చేస్తున్నారు. పలుచోట్ల ఉదయం మూడు గంటలు మాత్రమే కూరగాయలు తెచ్చుకునేందుకు అనుమతిస్తున్నారు. ప్రతిరోజూ ఆయా ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు | Prajasakti::Telugu Daily

Leave a Comment

Copyright @ 2016 - Prajasakti Telugu Daily All Rights Reserved. Designed By PRAJASAKTI TEAM