ప్రజాశక్తి - కడపఅర్బన్
దేశంలో ఆర్ఎస్ఎస్, విహెచ్పి, భజరంగదళ్ వంటి మతోన్మాద సంస్థలను ఎస్సి, ఎస్టి కమిషన్ చైర్మన్ కారెం శివాజీ పేర్కొన్నారు. భారతరాజ్యంగ పరిరక్షణ కోసం ఈ నెల 22న గుంటూరులో పరిరక్షణ మహా ర్యాలీ నిర్వహిస్తున్నామని, ఎస్సీ, ఎస్లీందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆదివారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో మాలమహానాడు జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సి,ఎస్టి,బిసి,మైనార్టీలకై దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. ఢిల్లీలో బిజెపి అండచూసుకుని మతోన్మాదులు రాజ్యాంగాన్ని తగులబెట్టాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్రోహశక్తులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని తిరగరాస్తామని కేంద్ర మంత్రి ప్రకటించడం ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా ఉందని పేర్కొన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చిన తరవాత ఎస్సి, ఎస్టి కులాలకు చెందిన మహిళలను వివస్త్రలను చేసి రోడ్డుమీద ఊరేగించి చాలా అపవిత్రంగా చేస్తున్నారని చెప్పారు. దళిత్ అనే పదాన్నిషేదించడం అంగీకరించమని పేర్కొన్నారు. ఈ పదాన్ని పోరాటాల ద్వారా మళ్లీ సాధించుకుందామని పిలుపు నిచ్చారు. ఉద్యమం, రాజకీయం వేర్వేరని చెప్పారు. ఆర్అండ్బి గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన ఎస్సి,ఎస్టి ప్రజల, సంఘాల నుంచి 150 ఆర్జీలు వచ్చాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాలమహానాడు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆర్ఎస్ఎస్, విహెచ్పి, భజరంగదళ్‌ను నిషేధించాలి
