ప్రజాశక్తి - నరసాపురం
సమస్యలు పరిష్కరించాలని తహశీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించినట్లు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కవురు పెద్దిరాజు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల పార్టీ చేపట్టిన యాత్రల సందర్భంగా పలు సమస్యలను గుర్తించామన్నారు. ఈ సమస్యలపై మెమోరాండంలను తహశీల్దార్ సూర్యనారాయణరెడ్డికి సమర్పించారు. వీటిలో ప్రధానంగా ఇళ్ల స్థలాలు, రేషన్‌కార్డులు, పట్టాలు, శ్మశానవాటికలు, విద్యుత్, రేషన్ తదితర సమస్యలపై మెమోరాండంలో పేర్కొన్నామని పెద్దిరాజు తెలిపారు.
త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తాం : తహశీల్దార్
సిపిఎం ఆధ్వర్యంలో తమ ముందుకు వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తహశీల్దార్ సూర్యనారాయణరెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల, పట్టణ కార్యదర్శులు ముచ్చర్ల త్రిమూర్తులు, మంచిలి నీలకంఠం, తెలగంశెట్టి సత్యనారాయణ, పొగాకు పూర్ణ, పొన్నాడ రాము, బూడిద జోగేశ్వరరావు, జల్లి రాము, మామిడిశెట్టి రామాంజనేయులు, బొక్కా శ్రీనివాసరావు, వాసా రామలింగం, పొగాకు నారాయణరావు, తిప్పా మల్లిఖార్జునరావు, కట్టుంగ నరేష్, ఎండీ షరీఫ్, తిరుమాని మృత్యుంజయ, విమల, సాగర్, కోరాడ పార్వతి, కర్రి చెల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆందోళన
