డెంగ్యూపై అవగాహన
ప్రజాశక్తి - బుచ్చెయ్యపేట
మండలంలోని కందిపూడి యుపి స్కూల్ విద్యార్థులకు బుధవారం డెంగ్యూ వ్యాధి నివారణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పిహెచ్సి వైద్యాధికారి చక్రవర్తి మాట్లాడుతూ, పరిసరాల పరిశుభ్రతతో వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చునని తెలిపారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ టి.కొండలరావు, హెచ్ఎం సింహాద్రప్పడు, ఎఎన్ఎం విజయ పాల్గొన్నారు.
చీడికాడ :
సాదారణ జ్వరాలను డెంగ్యూగా చెప్పి ప్రజలను భయ పెడితే సహించేది లేదని తహశీల్దార్ తారకేశ్వరి హెచ్చరించారు. స్థానిక పిహెచ్సిలో వైద్యాధికారి అరుణ్‌కుమార్ ఆధ్వర్యంలో ఆర్ఎంపి డాక్టర్లకు బుధవారం డెంగ్యూపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఆర్ఎంపిలు లైసెన్స్ లేకపోయినా, రెన్యువల్ చేయించకపోయినా వైద్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని ఆమె సూచించారు.వ్యాపారం కోసం ప్రజలను భయపెడితే సహించేది లేదన్నారు. తీవ్ర జ్వరంతో ఉన్న వారిని పిహెచ్‌సికి పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కుచ్చు కళావతి, ఎంపిడిఒ గ్లాడ్స్, సిబ్బంది, సిఎంఒ ప్రసాదరావు, పిహెచ్ఎన్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
డెంగ్యూపై అవగాహన
