ప్రజాశక్తి - ఆనందపురం
మండలంలోని ముచ్చెర్ల గ్రామ భూములపై తక్షణం తమకు తగిన న్యాయం చేయాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం బాధితులు ధర్నా నిర్వహించారు. అనంతరం తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత 40ఏళ్లుగా భూములు సాగుచేసుకుంటూ, జీడి మామిడి తోటలు వేసి ఉపాది పొందుతున్నామన్నారు. 47మంది రైతులకు ఒక్కక్కరికి ఎకరా భూమి చొప్పున 1978లో డి.ఫారం పట్టా కూడా యిచ్చారని తెలిపారు. అయితే ఈ భూములపై మాజీ ఎమ్మెల్యే భార్య అనుచరులు దౌర్జన్యం చేసి, కబ్జాకు పాల్పడి ఆటంకం కల్గిస్తున్నారని, దీనిపై తక్షణం న్యాయం చేయాలని భాధితులు తహశీల్దార్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితులకు సిపిఎం నాయకులు కె.ద్రాక్షాయిణి, కె.నాగరాణి, ఎస్.వర్మలు అండగా చిలిచారు.
ముచ్చెర్ల భూ భాధితుల ధర్నా
