యువత చేతిలోనే రాష్ట్ర భవిష్యత్ప్రజాశక్తి - గన్నవరం
ఏ రంగంలోనైనా స్కిల్స్‌ను పెంపొందించుకునే యువకులకు ఉద్యోగాలు వస్తాయని జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ గద్దె అనురాధ అన్నారు. మంగళవారం స్థానిక రాయనగర్లోని శ్రీవెంకటేశ్వర ఐటిఐలో జాబ్‌మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆమె మాట్లాడుతూ..యువతపైనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. రాష్ట్రాభివృద్ధితో పాటు యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. భవిష్యత్తులో అనేక పరిశ్రమలు, కంపెనీలు రాష్ట్రానికి వస్తాయని, సాంకేతిక రంగాల్లో యువత ప్రావీణ్యత సాధిస్తే వెంటనే ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఇప్పటికే ప్రవేటు కంపెనీలు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకొస్తున్నాయని అన్నారు. కష్టపడి పని చేయాలనే కోరిక ఉంటే ఏరంగంలోనైనా ఉద్యోగం పొందవచ్చన్నారు. నిరుద్యోగ యువతకు పరీక్షలు నిర్వహించి ఉద్యోగాలు చూపించడానికిఉపాధి కల్పన శాఖ అధికారులు చేస్తున్న కృషిని కొనియాడారు.ఎంపిపిపట్రా కవిత మాట్లాడుతూ మంచి పేరొందిన సంస్థలో ఉద్యోగాలు పొందాలంటే చదువుతో పాటు సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలన్నా రు. కంప్యూటర్ రంగంలో ప్రావీణ్యతను పెంచుకోడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఐటిఐ, ఎన్టిటిఎఫ్, పాలిటెక్నిక్ ఫిట్టర్ లాంటి కోర్సులు పూర్తి చేసిన వారికి కంపెనీల్లో ఉద్యోగాలు వస్తున్నాయన్నారు.
యువత ఎంత సేపూ ఇంజినీరింగ్ అంటూ అటువైపుకు ఎగబడటం వల్ల ఉపయోగాలు లేవని, కొత్త రంగాల్లోకి వెళ్లాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. జడ్పిటిసి మరీదు లక్ష్మిదుర్గ మాట్లాడుతూ పట్టుదల, సాధించాలనే లక్ష్యం ఉన్న వారికి ఉద్యోగాలు సులువుగా వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిల్లామేనేజర్ ఎ.సుధాకర్, జోనల్ మేనేజర్ ప్రసాద్, జిల్లా ఉపాధి కల్పన అధికారి రమేష్‌కుమార్, తహశీల్ధార్ గోపాలకృష్ణ,ఐటిఐ కళాశాల కరస్పాండెంట్ వెంకటరత్నం పాల్గొన్నారు.అనంతరం జరిగిన ఇంటర్యూల్లో 600 మంది యువకులు హజరయ్యారు. అందులో 210 మందిని ఎంపిక చేసి అర్హత పరీక్షలు రాయించారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు చూపిస్తామని రమేష్‌కుమార్ తెలిపారు.
యువత చేతిలోనే రాష్ట్ర భవిష్యత్
