ప్రజాశక్తి -మద్దిలపాలెం
దేశంలో స్వేచ్ఛ, జీవించే హక్కులకు భంగం కలుగుతోందని ఫోర్ ఫర్ దళిత్ స్టడీస్ డైరెక్టర్ ఆచార్య పి.అరుణ్‌కుమార్ అన్నారు. మంగళవారం ఎయులోని పాలిటిక్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సమావేశ మందిరంలో ఫోరం ఆధ్వర్యంలో ''ఆర్టికల్ 19, 21 స్వేచ్ఛ, జీవించే హక్కులపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణ్‌కుమార్ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత మనువాద సిద్ధాంతాన్ని అవలంభిస్తూ ముఖ్యంగా దళిత అణగారిన వర్గాలపై దాడులకు దిగుతున్నారని వాపోయారు. ఏమి తినాలో, ఎలా ఉండాలో శాసిస్తూ ప్రజా స్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. ప్రశ్నించే వారిని, మేధావులను, రచయితలను మట్టు బెడుతూ నిరంకుశ పాలన సాగిస్తున్నారన్నారు. సదస్సులో ఎయు న్యాయ కళాశాల సీనియర్ ఆచార్యులు బి.మధుసూదనరావు వ్యక్తి స్వేచ్ఛ, పుట్టుక పరిణామ క్రమాల గురించి వివరించారు. మరో సీనియర్ ఆచార్యురాలు నిర్మలా దేవి ఆర్టికల్ 21 జీవించే హుక్కు ప్రాధాన్యతలు గూర్చి వివరించారు. సదస్సుకు ఐఎఎస్ఇ డైరెక్టర్ ఆచార్య శివ ప్రసాద్ అధ్యక్షత వహించారు.
దేశంలో స్వేచ్ఛ, జీవించే హక్కులకు భంగం
