ప్రజాశక్తి - ఎడ్యుకేషన్
నవంబర్ 26 నుండి 28వ తేదీ వరకు జరిగిన జాతీయ క్రీడాపోటీల్లో ఆగిరిపిల్లలోని హ్యాపీ వ్యాలీ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనపరచి పతకాలు సాధించారని స్కూల్ ప్రిన్సిపాల్ సి.హెచ్. సరళ తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులకు సోమవారం పాఠశాల ఆవరణలో అభినందన సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూత్ అండ్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఆఫ్ఇండియా ఆధ్వర్యంలో జరిగిన రెండవ జాతీయ ఫెడరేషన్ చాంపియన్‌షిప్ పోటీల్లో తమ విద్యార్థులు పాల్గొనడంతో పాటు పతకాలు సాధించడం ఆనందంగా ఉందన్నారు. ఫుట్‌బాల్ అండర్ -17లో ఐదు రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొనగా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు జట్లు సెమి ఫైనల్స్‌లో పోటీ పడగా 4-0తో ఆంధ్రప్రదేశ్ జట్టుగెలుపొంది ఫైనల్ప్కు అర్హుత సాధించిందన్నారు. ఫైనల్స్‌లో ఉత్తరప్రదేశ్‌తో తలపడి 3-0 ఆధిక్యతతో ఆంధ్రప్రదేశ్జట్టు విజయం సాధించిందన్నారు. బ్యాడ్మింటన్ సింగిల్స్ అండర్ -14 విభాగంలో పంజాబ్‌పై, అండర్ -17 విభాగంలో తమిళనాడు జట్టుపై ఫైనల్స్‌లో ఆంధ్రప్రదేశ్‌పై గెలుపొందిందని తెలిపారు. క్రికెట్ అండర్ -14 ఫైనల్స్‌లో తమిళనాడుతో తలపడి 15 పరుగుల తేడాతో, అండర్ -14 అథ్లెటిక్స్ 400 మీటర్ల పరుగుపందెంలో ఆంధ్రప్రదేశ్జట్టు విజయం సాధించిందన్నారు. జాతీయ క్రీడలలో బంగారు పతకాలు సాధించడంతో స్కూల్ వ్యవస్థాపకులు డాక్టర్ కె.కోటేశ్వరరావు, విద్యార్థులను, కోచ్ మధు, రాజేష్ థామస్, మణికంఠలను అభినందించారు.
జాతీయ క్రీడా పోటీల్లో 'హ్యాపీవ్యాలీ' విద్యార్థుల ప్రతిభ
