పల్లె పోరుకు రంగం సిద్ధం
వార్డుల వారీగా ఓటర్లు, ఫొటో జాబితా
అన్ని పంచాయతీల్లో అందుబాటులో
పల్లె పోరుకు రంగం సిద్ధమైంది.జిల్లాలో పంచాయతీ వార్డుల ఓటర్ల జాబితా, వార్డుల సంఖ్య మంగళవారం విడుదలైంది. ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు నిర్వహించిన విషయం విధితమే. ఫలితాలు మరో 24 గంటల్లో వెలువడనున్నాయి. ఈ వేడిలోనే పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆశా వహులు ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు.
ప్రజాశక్తి- నెల్లూరు సిటీ ప్రతినిధి
జిల్లాలో పల్లెపోరుకు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశలో ఉన్నాయి. మరో24 గంటల్లో ఫలితాలు వెలవడనున్నాయి. ఈ సందర్భంలోనే పంచాయతీ ఎన్నికల హడావుడి మొదలవడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల ప్రచారం క్రమంలో ప్రధాన పార్టీల అభ్యర్థులు పల్లెల్లో బలమైన అభ్యర్థులకు భరోసా ఇచ్చి వెళ్లారు. ఈ క్రమంలో ఆశావహులు పోటీకి తాము సిద్ధమంటూ సంకేతాలిస్తున్నారు. ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు.
జిల్లాలో 16.50 లక్షల ఓటర్లు
జిల్లాలోని పంచాయతీల పరిధిలో ఓటర్ల జాబితాను అధికారులు మంగళవారం పూర్తి స్థాయిలో విడుదల చేశారు. ఓటర్ల లిస్టులు ఫొటో, జాబితాలను
ప్రచురించి మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. వివిధ పార్టీల నాయకులకు ప్రతులను పంపిణీ చేశారు.అధికారుల గణాంకాల ప్రకారం జిల్లాలోని 940 పంచాయతీలను 8,910 వార్డులుగా నిర్ణయించారు. మొత్తం 16,45,439 మంది ఓటర్లు ఉన్నారని స్పష్టం చేశారు. వారిలో స్త్రీలు 8,35,412 మంది, పురుషులు 8,09,842 మంది ఉన్నారు. పురుషులతో పోల్చిచూస్తే స్త్రీలు 25, 570 మంది అధికంగా ఉన్నారు. ఇతరులు 185 మంది ఉన్నారు.
పాత పొరపాట్లే
మున్సిపల్ వార్డుల ఓటర్ల జాబితాలో వెల్లడైన విధంగానే పంచాయతీ ఓటర్ల జాబితాలోనూ తప్పులు దొర్లాయని తెలుస్తోంది. ఓటర్లు, ఫొటో జాబితాలను అన్ని రాజకీయ పార్టీలకు, మండల కేంద్రాలోనూ అందుబాటులో ఉంచారు. కొన్ని మండలాల్లో ఒక రోజు ముందుగానే ప్రకటించిన విషయం విధితమే. ఆ జాబితాను పరిశీలించిన వారు పెదవి విరుస్తున్నారు. ఒక గ్రామంలోని ఓటర్లు మరో వార్డులో పేర్లు ప్రచురితమైనట్లు తెలుస్తోంది. ఒకే కటుంబంలోన సభ్యులకు వేర్వేరు చోట్ల పేర్లు వచ్చినట్లు పలువురు వాపోతున్నారు.
22న కస్తూర్బా కళాక్షేత్రంలో శిక్షణ తరగతులు
ప్రజాశక్తి-నెల్లూరు
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కౌంటింగ్ సూపర్ వైజర్లకు, మైక్రో అబ్జర్వర్లకు, కౌంటింగ్ సహాయకులకు కస్తూర్భా కళాక్షేత్రంలో శిక్షణ తరగతులు జరుగుతాయని జిల్లా ఎన్నికల అధికారి రేవు ముత్యాలరాజు ఆదేశించారు. బుధవారం ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యే సిబ్బంది అందరూ విధిగా రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలు తీసుకొని రావాలని తెలిపారు.
పల్లె పోరుకు రంగం సిద్ధం
