కాకినాడ సిటీ భర్త వేధిస్తున్నాడని పిఠాపురం పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోక పోవడంతో జిల్లా పోలీసు కార్యాలయం ఎదుట వివాహిత ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది. పిఠాపురం అగ్రహారానికి చెందిన అల్లం లోవరాజుకు అల్లం సునీతకు కొన్నేళ్ల క్రితం వివాహమైంది. సునీత ఓ ప్రయివేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. లోవరాజు ఓ పత్రికలో విలేకరిగా పనిచేస్తున్నాడు. లోవరాజుకు మరో మహిళతో వివాహేత సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో సునీత, లోవరాజుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. లోవరాజు సునీతన మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె పిఠాపురం పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే భర్త విలేకరి కావడంతో పోలీసులు పట్టించుకోవటం లేదని సోమవారం ఎస్పి కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్ సెల్లో ఫిర్యాదు చేసేందుకు కాకినాడ వెళ్లింది. సాయంత్రం వరకూ అక్కడే ఉంది. ఎవరూ పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైంది. ఆమె వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగింది. ఇది గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను హుటాహుటిన కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఎస్పి కార్యాలయం ఎదుట వివాహిత ఆత్మహత్యాయత్నం
