ప్రజాశక్తి - ఎడ్యుకేషన్
ఎంఐటి స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో రానున్న విద్యా సంవత్సరంలో రెండేళ్ల మాస్టర్స్ కోర్సు ఇన్ పొలిటికల్ లీడర్షిప్ గవర్నమెంట్ కోర్సును అందిస్తున్నట్లు యూనివర్శిటీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాహుల్ కరాడ్ ఒక ప్రకటనలో తెలిపారు. యువతను సమర్థ రాజకీయనాయకులుగా రూపుదిద్దుకునేలా ఇది రూపొందించనున్నట్లు తెలిపారు. ఈకోర్సును యూజిసి ఆమోదించిందన్నారు. ఆర్థిక సుస్థిరత, వృద్ధిలపై ప్రభుత్వ విధానాల ప్రభావం, దేశంలో సామాజిక, రాజకీయ స్థితిగతులను చట్టాలు ఏవిధంగా ప్రభావితం చేస్తాయి వంటి వాటిపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు రీసెర్చ్ అసోసియేషన్, పొలిటికల్ అనలిస్ట్, పాలసీ అసోసియేట్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్, పొలిటికల్ కన్సల్టెంట్, ఎలక్షన్రీసెర్చ్, అండ్ క్యాంపెయిన్ మేనేజర్‌గా కెరీర్ అవకాశాలు పొందవచ్చని తెలిపారు. ఇందులో భాగంగానే పూణెలోని సంస్థ క్యాంపస్ నందు ఈనెల 18 నుండి మూడు రోజుల పాటు ఛాత్ర సంసద్ పేరుతో జాతీయస్థాయి సదస్సు జరుగుతుందన్నారు. ఈసదస్సుకు దేశ వ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాల నుండి విద్యార్థులను పెద్ద సంఖ్యలో ఆహ్వానించినట్లు తెలిపారు. ఈకోర్సు గురించి తెలియచేయనున్నట్లు తెలిపారు. కోర్సు వివరాలతో పాటు రాజకీయ అంశాల గురించి కూడా తెలియచేయనున్నట్లు తెలిపారు.
పొలిటికల్ లీడర్‌షిప్‌పై మాస్టర్స్ కోర్సు
