ప్రజాశక్తి-సత్యనారాయణపురం
విజయవాడ మ్యూజిక్ అకాడమి ఆధ్వర్యంలో సద్గురు త్యాగరాజు ఆరాధనా సంగీతోత్సవాలు శనివారం ప్రారంభమైయ్యాయి. దుర్గాపురంలోని ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రభుత్వ సంగీత, నృత్యకళాశాలలో శనివారం ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నప విశాలాంధ్ర మాజీ సంపాదకులు సి.రాఘవాచారి మాట్లాడుతూ సంగీతం ప్రాముఖ్యతను వివరించారు. ప్రారంభ సభలో కొమాండూరి శేషాద్రి, సినీ నటులు పిళ్లా.లక్ష్మీప్రసాద్, ఎం.సి.దాసు, అంబటి మధుమోహన్ కృష్ణ, భాసురపల్లి.వేంకటేశఉ్ల, అన్నవరపు రామస్వామి, విజయవాడ మ్యూజిక్ అకాడమి ఆర్గనైజింగ్ సెక్రటరీ దేశరాజు సూర్య, వ్యవస్థాపక కార్యదర్శి శీరం.సుబ్రహ్మణ్యం, వ్యవస్థాపకులు మాచిరాజు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. అనంతరం చెన్నైకు చెందిన అనువ్రత నరసింహన్, విజయవాడకు చెందిన సివిసి.శాస్త్రిలచే గాత్ర కచేరీలు జరిగాయి. అమెరికాకు చెందిన శ్రీనివాస సుభాష్చే వయోలిన్ కచేరి జరిగింది.
త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవాలు ప్రారంభం
