బంగారం అక్రమంగా తరలిస్తున్న నిందితుల అరెస్టుప్రజాశక్తి - మొగల్రాజపురం
బిల్లులు లేకుండా బంగారాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 1232 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు సెల్ఫోన్లు, మోటారు బైక్, రూ.4030 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి బిల్లులు లేకుండా బంగారు ఆభరణాలను వరంగల్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో టాస్క్‌పోర్స్ ఎసిపి జి.రాజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వలపన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...నగరంలోని బిఆర్టిఎస్ రోడ్డులో డోర్ నెం.12-1-132 గల ఇంటిలో మహ్మద్ షబ్బీర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సుమారు 20 సంవత్సరాల నుండి బంగారపు పని చుస్తూ 2001లో తన ఇంటి కింది పోర్షన్లో స్వంతగా నగల తయారీ కార్ఖానా ఏర్పాటు చేసుకుని వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇతని వద్ద సుమారు 10 మంది వర్క్‌ర్లు పని చేస్తున్నారు. గత కొంత కాలం నుండి మహ్మద్ షబ్బీర్ తన నగల దుకాణంలో బిల్లులు లేకుండా బంగారు ఆభరణాలను తయారు చేసి విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తన షాపులో బంగారు ఆభరణాలు తయారు చేసి వాటిని తన వద్ద పని చేసే పఠాన్ రిజ్వాన్ ఖాన్,షేక్ షారూఖ్‌లతో వరంగల్ తరలించేందుకు సిద్దపడ్డాడు. ఈ నేపధ్యంలో బంగారం అక్రమ తరలింపు గురించి సమాచారం అందుకున్న టాస్క్‌పోర్స్ పోలీసులు నిందుతులను అరెస్టు చేశారు. బంగారం అక్రమంగా తరలిస్తున్న నిందితుల అరెస్టుప్రజాశక్తి - మొగల్రాజపురం
బిల్లులు లేకుండా బంగారాన్ని తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 1232 గ్రాముల బంగారు ఆభరణాలు, మూడు సెల్ఫోన్లు, మోటారు బైక్, రూ.4030 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి బిల్లులు లేకుండా బంగారు ఆభరణాలను వరంగల్‌కు తరలించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో టాస్క్‌పోర్స్ ఎసిపి జి.రాజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వలపన్ని చాకచక్యంగా పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...నగరంలోని బిఆర్టిఎస్ రోడ్డులో డోర్ నెం.12-1-132 గల ఇంటిలో మహ్మద్ షబ్బీర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సుమారు 20 సంవత్సరాల నుండి బంగారపు పని చుస్తూ 2001లో తన ఇంటి కింది పోర్షన్లో స్వంతగా నగల తయారీ కార్ఖానా ఏర్పాటు చేసుకుని వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇతని వద్ద సుమారు 10 మంది వర్క్‌ర్లు పని చేస్తున్నారు. గత కొంత కాలం నుండి మహ్మద్ షబ్బీర్ తన నగల దుకాణంలో బిల్లులు లేకుండా బంగారు ఆభరణాలను తయారు చేసి విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం తన షాపులో బంగారు ఆభరణాలు తయారు చేసి వాటిని తన వద్ద పని చేసే పఠాన్ రిజ్వాన్ ఖాన్,షేక్ షారూఖ్‌లతో వరంగల్ తరలించేందుకు సిద్దపడ్డాడు. ఈ నేపధ్యంలో బంగారం అక్రమ తరలింపు గురించి సమాచారం అందుకున్న టాస్క్‌పోర్స్ పోలీసులు నిందుతులను అరెస్టు చేశారు.
బంగారం అక్రమంగా తరలిస్తున్న నిందితుల అరెస్టు
