- టిడిపి కార్పొరేటర్లు
ప్రజాశక్తి-విజయవాడ
కనక దుర్గా కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ వ్యవహారంలో ఎటువంటి అక్రమాలూ జరగలేదని, ఎటువంటి విచారణకైనా సిద్ధమని టిడిపి ఫ్లోర్‌లీడర్ గుండారపు హరిబాబు తెలిపారు. టిడిపి కార్పొరేటర్ల ఛాంబర్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరులతో ఆయన, కార్పొరేటర్లు మాట్లాడారు. ఈ నెల 7న జరిగిన కౌన్సిల్లో ఆమోదించిన కనకదుర్గా కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లేఅవుట్స్ మంజూరు అంశం కౌన్సిల్లో ఆమోదించిన తీరుపై విపక్షాలు, మీడియాలో అవినీతి అక్రమాలపై పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవమూ లేదని పేర్కొన్నారు. అవినీతి జరిగినట్లు రుజువుచేస్తే దేనికైనా సిద్ధమేనని పేర్కొన్నారు. సిబిఐ లేదా అమెరికా దర్యాప్తు సంస్థ ''రా'' సంస్థతో దర్యాప్తు చేసుకున్నా అభ్యంతరం లేదని పేర్కొన్నారు. చివరి నిమిషంలో అత్యవసరంగా ఆమోదించిన విషయంలోనే సభ్యుల్లో కొంత అపోహలు ఉన్నందున సాధ్యమైన మేరకు అత్యవసరంగా సమావేశం నిర్వహించి, చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ ఎన్ జగదీష్, పైడి తులసి, గండూరి మహేష్, నెలిబండ్ల బాలస్వామి పాల్గొన్నారు.
విచారణకు సిద్ధం
