విజయనగరంకోట : జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదరంగం పోటీలు ఘనంగా జరిగాయి. కొట్రా సుందరరామయ్య మెమోరియల్ చెస్ టోర్నమెంట్ పోటీలను జిల్లా చెస్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు పివి నర్సింహరాజు ప్రారంభించారు. ఈ పోటీలకు పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన వందమంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పోటీల్లో బాలికల విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను పోర్టుసిటీ పాఠశాలకు చెందిన ఎస్.తీక్షణ, పి.మీనాక్షి జాస్మిత, కె.ప్రతీ కైవసం చేసుకోగా, పి.చాందిని (డఫ్అండ్డమ్ స్కూల్)కి కన్సొలేషన్ బహుమతి లభించింది. అలాగే బాలుర విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను పోర్టుసిటీ పాఠశాలకు చెందిన ఆర్.పార్ధసారధి, ఎం.హేమంత్ హరిహరన్, కెజె హర్ష కైవసం చేసుకొన్నారు. కన్సొలేషన్ బహుమతులు బి.సౌభ్రాత్ (ఢిల్లీ పబ్లిక్ స్కూల్), ఎన్ఎస్ శ్రీనివాస్ (గురజాడ స్కూల్), కెఎల్ గౌతమ్ (వైజాగ్ ఇంటర్నేషన్ స్కూల్)కు లభించాయి. విజేతలకు ఈనెల 20న ముగింపు సమావేశంలో బహుమతులను అందజేస్తామన్నారు. ఈ పోటీలకు చీఫ్ ఆర్బిటర్గా ఈపు విజయకుమార్, సహాయ ఆర్బిటర్గా ఎం.రాజారాంప్రసాద్ వ్యవహరించారు. కార్యక్రమంలో జిల్లాకేంద్ర గ్రంథాలయ కార్యదర్శి ఎన్.లలిత, డి.గోపాలరావు, అసిస్టెంట్ లైబ్రేరియన్ కె.శ్రీనివాస్ హాజరయ్యారు.
ఉత్సాహంగా చెస్ పోటీలు
