ముగ్గురిపై కేసులు
ప్రజాశక్తి-బొబ్బిలి
బలిజిపేట మండలం గాలావిల్లి, గంగాడ, పట్టణంలో మద్యం సీసాలతో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేశామని ఎక్సైజ్ సిఐ క్రాంతిసురేష్ తెలిపారు. స్థానిక విలేకరులతో గురువారం ఆయన మాట్లాడారు. సమస్యాత్మక గ్రామాలైన గాలావిల్లి, గంగాడల్లో రైడ్ చేసి మద్యం బాటిళ్లు సీజ్ చేశామన్నారు. గుణపూర్ సత్యనారాయణ, కరణం గణేష్ వద్ద నుండి 27 మద్యం సీసాలు, బొబ్బిలిలో వి.అప్పారావు వద్ద నుండి 9 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని వారిలో ముగ్గురిపై కేసులు నమోదు చేశామన్నారు. ఎన్నికల నేపథ్యంలో గస్తీ ముమ్మరం చేశామని, అక్రమ మద్యం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు.
ముగ్గురిపై కేసులు
