ఘనంగా బాలికల గ్రిక్స్ పోటీలు
ప్రజాశక్తి - కొత్తవలస
మండలంలోని బలిఘట్టాం వద్దగల న్యూ హోప్ జీవన్ జ్యోతిహైస్కూల్ ఆవరణలో జిల్లా స్థాయి బాలికల గ్రిక్స్ పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఎస్ఎస్ఎ పిఒ బి.శ్రీనివాసరావు, కొత్తవలస జెడ్పిటిసి సభ్యులు కోళ్ల రమణమ్మ, ఎంపిపి పి.రాజన్న జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ పోటీలకు జిల్లాలోని 22 పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఏదో ఒక క్రీడలో ప్రావిణ్యత సాధించాలన్నారు. గెలుపు ఓటములు సర్వ సాధారణమని, ఓటమి లక్ష్య సాధనకు మార్గంగా భావించాలని అన్నారు. విద్యార్థులు క్రీడా స్ఫూర్తితో మెలగాలని అన్నారు. క్రీడలలో రాణించిన వారికి ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, విన్యాసాలు అందరినీ ఆకట్టు కున్నాయి. కార్యక్రమ ంలో జిల్లా స్పోర్ట్సు అసోసియేషన్ చైర్మన్ జి.శివ, ఎంఇఒ జి.శ్రీదేవి, విడిఎస్ఎస్ఎ కార్యదర్శి జి.లక్ష్మణ రావు, జోన్2 ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.శ్రీరాములు, పిడిఆర్ జగదీష్, స్కూల్ హెచ్ఎం సిహెచ్ సత్య నారాయణ, బలిఘట్టం గ్రామ పెద్దలు కొరుపోలు సూరిబాబు, ఆదిరెడ్డి నాయుడు,పీడీలు పాల్గొన్నారు.
ఘనంగా బాలికల గ్రిక్స్ పోటీలు
