బావిలో దూకి యువకుడు ఆత్మహత్య
ప్రజాశక్తి-బాడంగి
మండలంలోని కోడూరు గ్రామంలో బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటుచేసుకుంది. హెచ్‌సి వెంకటస్వామి అందించిన వివరాల ప్రకారం కోడూరుకు చెందిన పడాల బాలరాజు(27) బుధవారం బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. బాలరాజుకు అదే గ్రామానికి చెందిన శోభతో ఏడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరూ ఆడ పిల్లలు ఐదేళ్ల రమ్య, మూడేళ్ల లక్ష్మి ఉన్నారు. పెళ్లైన నాలుగు సంవత్సరాలు భార్య భర్తలిద్దరూ ఆనందగా గడిపారని, ఈ మధ్యనే రెండు సంవత్సరాల నుంచి వీరిద్దరి మద్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేక బాలరాజు మృతి చెందాడు. కుమారుడు మృతి చెందడంతో తండ్రి వెంకట స్వామి రోధన అందరిని కంటతడి పెట్టించింది. హెచ్‌సి వివి స్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బావిలో దూకి యువకుడు ఆత్మహత్య
