ప్రజాశక్తి-కలెక్టరేట్
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా నుండి రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని జిల్లా కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్ అభినందిం చారు. గురువారం జిల్లా కలెక్టర్ ను కలెక్టర్ చాంబర్లో కలిసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రస్థాయిలో అవార్డులు పొందిన ఉపాధ్యాయులు మరింత బాధ్యతతో కృషి చేసి విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దాలని కోరారు. వీరంతా జాతీయ స్థాయిలో కూడా ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జిల్లాలోని ఇతర ఉపాధ్యాయులు కూడా వారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వీరంతా ఈ నెల 5వ తేదీన రాష్ట్ర రాజధాని అమరావతిలో జరిగిన గురుపూజోత్సవ వేడుకలు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులమీదుగా అవార్డులు అందుకున్న విషయం విధితమే. వీరితో పాటు మరో ముగ్గురు ఉపాధ్యాయులకు ఎన్ఎఫ్టిఎ అవార్డులు లభించాయి. వీరందరికీ కలెక్టర్ అభినందనలు తెలిపారు.
రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు కలెక్టర్ అభినందన
