కావల్సినవి : పులస చేప : 1, వెన్న : 1 స్పూను, చింతపండు : సరిపడా, ధనియాలు : 2 స్పూన్లు, మెంతులు : 1/4 కప్పు, ఉల్లిపాయలు : 2, పచ్చిమిర్చి : 6, ఆవకాయ నూనె : 2 స్పూన్లు, ఉప్పు : రుచికి సరిపడా, కారం : 2 స్పూన్లు, కరివేపాకు రెబ్బలు : 2, కొత్తిమీర : కొద్దిగా
తయారీ : మొదటగా పులస చేపని శుభ్రం చేసి కావాలసిన సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. మెంతులు, ధనియాలు, జీలకర, ఆవాలు మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఉల్లిపాయను, పచ్చిమిరపను చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ వెలిగించి పాన్ పెట్టి అందులో నూనె వేసి కాగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరప, కొత్తిమీర వేసి దోరగా వేపాలి. వేగినాక గ్రైండ్ చేసి పెట్టుకొన్న మసాలా ముద్దను అందులో వేసి వేపాలి. 5 నిమిషాలైనాక పులస చేప ముక్కలను, ఆవకాయనూనెను, ఉప్ప, కారం వేసి వేపాలి చివరగా చింతపులుసు పోసి కలిపి ఉడకనివ్వాలి. స్టౌ మీద నుంచి దింపుకొనే ముందుగా కొద్దిగా వేన్న, కరివేపాకు వేస్తే రంగుతో పాటు, రుచి కూడా బాగా ఉంటుంది. ఇలా తయారైన పులస పులుసు వేడి వేడిగా అథిదులకు వడ్డించండి.