కావాల్సిన పదార్థాలు
గోధుమపిండి-1 కప్పు
మైదా-1కప్పు
పచ్చిబఠాణీలు-1/2 కప్పు
అల్లం పచ్చిమిర్చి పేస్ట్-1/2 కప్పు
గరం మసాలా-1/4 టీ స్పూన్
జీలకర్ర- 1/4 టేబుల్ స్పూన్
ఉప్పు-తగినంత
నూనె-వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
ఓ గిన్నెలో మైదా గోధుమపిండి కొద్దిగా ఉప్పు చెంచా నూనె తీసుకుని సరిపడా నీటితో చపాతీపిండిలా కలిపి పక్కనపెట్టుకోవాలి. ఇది నానేలోగా పచ్చిబఠాణీలను ఉడికించుకోవాలి. ఆ నీటిని వంపేసి గరిటెతోనే వాటిని మెత్తగా మెదిపి పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో చెంచా నూనె వేడిచేసి జీలకర్ర వేయించాలి. అందులోనే పచ్చిబఠాణీల ముద్ద అల్లం పచ్చిమిర్చి పేస్టు, గరం మసాలా తగినంత ఉప్పు వేసి బాగా కలిపి రెండు మూడు నిమిషాలు వేయించి దింపేయాలి. చపాతీపిండిని తీసుకుని మరోసారి కలిపి చిన్నచిన్న ఉండల్లా చేసుకోవాలి. ఓ ఉండను తీసుకుని చిన్న పూరీలా వత్తి మధ్యలో పచ్చిబఠాణీల మిశ్రమాన్ని ఉంచాలి. దానిపై మరో పూరిని ఉంచి చివర్లను మూసేసి మరోసారి గుడ్రంగా వత్తాలి. ఇలా చేసుకున్న పూరీలను కాగుతున్న నూనెలో వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి ఒక ప్లేట్లో వుంచాలి. వీటిని వేడి వేడిగా తింటే చాలా రుచికరంగా వుంటాయి.
స్టఫ్డ్ పూరీలు
