కావాల్సిన పదార్థాలు:
మామిడి కాయలు (పుల్లనివి) - మూడు
కారం - 1 కప్పు, మెంతి పొడి -1/4 కప్పు
ఉప్పు- 1/4 కప్పు, మెంతులు- 1 టేబుల్ స్పూను
ఆవాల నూనె 1/4 కప్పు
తయారుచేసే విధానం:
ముందుగా మామిడి కాయల్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి. అరగంట పాటు వాటిని ఆరనిచ్చి తర్వాత తొక్కతీయకుండా చిన్న చిన్న ముక్కల్ని తరగాలి. ఇప్పుడు ఆవాలు, మెంతులను బంగారు రంగు వచ్చేవరకు వేయించి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి. నువ్వుల నూనెను వేడి చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి కారం, ఉప్పు, ఆవాలు, మెంతుల పొడి వేసి కలపాలి. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని కూడా వేసి ఈ మిశ్రమం ముక్కలకి పట్టేలా బాగా కలపాలి. తర్వాత ఒక సీసా లేదా జాడి తీసుకుని పచ్చడిని అందులో ఉంచి మూతపెట్టాలి. ఒక రోజంతా మగ్గనిచ్చి తర్వాత పోపు వేసి అందులో పచ్చడినంతా కలపాలి. గాలి చొరబడకుండా భద్రపరిస్తే ఈ పచ్చడి నెల రోజులు పాడవకుండా ఉంటుంది.
****
నువ్వుల ఆవకాయ
కావాల్సిన పదార్థాలు :
మామిడికాయ ముక్కలు - 2 1/2 కప్పులు
నువ్వులు - 1/2 కప్పు
కారం - 1/3 కప్పు, ఉప్పు-1/2
నువ్వుల నూనె - 1/2 కప్పు
తయారుచేసే విధానం:
ముందుగా మామిడి కాయల్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత మామిడి కాయల్ని సగానికి తరిగి మధ్యలో ఉండే టెంకను వేరు చేసి ముక్కలు కట్చేయాలి. ముక్కలకు తడిలేకుండా ఉండేలా కొంత సేపు ఆరనివ్వాలి. నువ్వుల్ని గోధుమ రంగు వచ్చేలా వేయించి చల్లారాక మిక్సీ జార్లో వేసి పొడిచేసుకోవాలి. మరీ ఎక్కువ సేపు బ్లెండ్ చేస్తే నువ్వులు రుచిగా ఉండవు. ఇప్పుడు కొంచెం పెద్ద బౌల్ తీసుకుని నువ్వుల పొడి, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో మామిడి ముక్క లు వేసి వాటికి ఉప్పు, కారం, నువ్వుల పొడి బాగా పట్టేలా కలపుకోవాలి. ఇందులో నూనె వేసి మరో సారి కలపాలి. ఇప్పుడొక గాజు సీసా లేదా జాడీ తీసుకుని బాగా కలపిన మామిడి ముక్కల మిశ్ర మాన్ని అందులో ఉంచాలి. తర్వాత ఆ మిశ్రమంపై నువ్వుల నూనె వేసి గాలి చొరబడ కుండా మూత పెట్టాలి. ఈ పచ్చడిని రెండు మూడు రోజులు నాననివ్వాలి. నూనె పైకి తేలే కొద్దీ పచ్చడి తయార వుతుంది. వీలున్నప్పుడు పచ్చడి కలుపుతూ రెండు, మూడు రోజులు మగ్గనివ్వాలి.
****
పంజాబీ అచార్
కావాల్సిన పదార్థాలు:
మామిడి కాయ ముక్కలు - 4 కప్పులు
ఆవాల పొడి -
1 కప్పు
పచ్చి ఆవాల పొడి - 1/2 కప్పు
ఉప్పు - 1 కప్పు
సోంపు - 100 గ్రాములు
మెంతులు- 3 టేబుల్ స్పూన్లు
నల్లజీలకర్ర - 1 టేబుల్ స్పూన్
పసుపు - 1 టేబుల్ స్పూన్,
ఆవనూనె - 350 మి.లీటర్లు
తయారు చేసే విధానం :
ముందుగా మామిడి కాయల్ని శుభ్రంగా కడిగి ఆరనివ్వాలి. తర్వాత చిన్న ముక్కలుగా తరిగి కొంత సేపు ఆరబెట్టాలి. ఇప్పుడు మిక్సీ జార్లో సోంపు, మెంతులు వేసి పొడి చేయాలి. తర్వాత ఒక పెద్ద బౌల్లో మామిడి ముక్కల్ని తీసుకుని అందులో ఆవాలు సోంపు, మెంతి పొడి, ఉప్పు, పసుపు రంగు ఆవాలు, నల్ల జీలకర్ర, పసుపు వేసి బాగా కలపాలి. మరో బౌల్ తీసుకుని అందులో ఆవాలు, సోంపు, మెంతి పొడులు తీసుకుని కొంచెం నూనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మామిడి ముక్కల మిశ్రమానికి జతచేర్చి మరోసారి బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక గాజు సీసా లేదా జాడీలోకి తీసుకుని పావు కప్పు నూనె వేసి మూత పెట్టాలి. ఒకరోజు తర్వాత ఈ మిశ్రమంలో మరికొంచెం నూనె వేసి కలిపి మూతపెట్టాలి. రెండు మూడు రోజులు మగ్గనివ్వాలి. కారం వాడకుండా తయారు చేసే ఈ పచ్చడి చెపాతి, పరోటాల్లోకి చాలా రుచిగా ఉంటుంది.