తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా

హైదరాబాద్‌ : గవర్నర్‌ ప్రసంగం ముగిసిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశలు రేపటికి వాయిదా పడ్డాయి. దీంతో రేపు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగనుండగా.. ఈ నెల 10న తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ ను ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టనున్నారు.

  • తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఇక, ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగించారు. కాళోజీ కవితతో ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కంచెను తొలగించామని అన్నారు. ఆరు గ్యారెంటీల్లో రెండింటిని అమలు చేశామని చెప్పారు. త్వరలో మరో రెండు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. అర్హులకు రూ.500లకే గ్యాస్‌ సిలిండర్‌.. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. రైతులు, మహిళలు, యువతకు ఇచ్చిన హామీల అములుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి మాకు అప్పగించారని.. రాష్ట్రాన్ని పునర్‌నిర్మించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. అలాగే, మూసీ నదిని అభివద్ధి చేసి ఉపాధి కల్పిస్తామని గవర్నరత్‌ తమిళిసై పేర్కొన్నారు. దేశానికి హైదరాబాద్‌ను ఏఐ రాజధానిగా మార్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కొత్తగా 40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాం.. చిన్న పరిశ్రమల అభివద్ధి కోసం కొత్త ఎంఎస్‌ఎంఈ పాలసీ రూపొందించాం.. వెయ్యి ఎకరాల్లో 10-12 ఫార్మా విలేజీలు.. మూసీ నది ప్రక్షాళనలకు ప్రణాళిక రూపొందించామని గవర్నర్‌ పేర్కొన్నారు. ఎకో ఫ్రెండ్లీ టూరిజం హబ్‌గా హుస్సేన్‌సాగర్‌, లక్నవరం చెరువులను అభివద్ది చేస్తామన్నారు. టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీ తీసుకు వస్తామని తమిళిసై సౌందరరాజన్‌ తెలిపారు.

➡️