- ప్రతి ఎకరానికి నీరందించడమే లక్ష్యం
- టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో చెరువులన్నీ జలమయం అవుతాయని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని మల్కపేట వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్‌తోపాటు కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీ పనులను కేటీఆర్ సోమవారం పరిశీలించారు. టన్నెల్తోపాటు, గ్రావిటీ కెనాల్ పనులను పరిశీలించి పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీ పనులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 45లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. జిల్లాలో వ్యవసాయ రంగానికి అవసరమైన సాగునీటి కష్టాలు తీర్చి శాశ్వత పరిష్కారం కోసం మల్కపేట రిజర్వాయర్ నిర్మాణం చేపడుతున్నామన్నారు. రిజర్వాయర్ నిర్మాణంలో భూమిని కోల్పోయిన నిర్వాసితులందరికీ పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. భూమి అందించిన రైతులకు ప్రభుత్వం రుణపడి ఉందని తెలిపారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు రమేష్‌బాబు, రవిశంకర్, రసమయి బాలకిషన్, జిల్లా కలెక్టర్ దేవరకొండ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్‌హెగ్డే, టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, ప్రాజెక్ట్ ఈఈ శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.
కాళేశ్వరం నీటితో చెరువులకు జలకళ
