- సర్కారు నిర్లక్ష్యం!
- మూడేళ్లుగా లెక్కల్లేవ్
- కేంద్ర వద్ద ఆగిన ఐదువందల కోట్లు
ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా కేంద్రం నుంచి రావాల్సిన రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (ఆర్కెవివై) నిధులు ఆగిపోయాయి. ఆ నిధులను దారి మళ్లించడంతో మిషన్ ఫర్ ఇంటిగ్రేటేడ్ డెవలంప్మెంట్ ఆఫ్ హార్టికల్చరర్ (ఎంఐడీహెచ్) నిబంధన ప్రకారం లెక్కలు సమర్పించాలి. ఆ తర్వాతనే కేంద్రం నిధులను విడుదల చేస్తుంది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆర్కెవివై ద్వారా కేంద్రం నుంచి ఈ నిధులు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం వాటా 60 శాతం, రాష్ట్రప్రభుత్వం వాటా 40 శాతం చొప్పున వ్యవసాయ శాఖకు నిధుల కేటాయింపులు చేయనుంది. ప్రతి ఏటా ఆర్కెవివై కింద నిధులు వ్యవసాయశాఖకు రావాల్సి ఉన్నా...గత మూడేండ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లెక్కలు సమర్పించకపోవడంతో రావాల్సిన నిధులు కూడా ఆగిపోయాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా చేయాలని భావిస్తున్న నేపథ్యంలో సీడ్స్ అభివృద్ధికి రావాల్సిన నిధులను దారి మళ్లించిందిదీ నిధులతో సీడ్స్ పరీక్షల కోసం ల్యాబ్‌ల కొరత తీవ్రంగా ఉన్నది. అయినప్పటికీ సీడ్స్‌పై తగిన దృష్టి సారించడంల లేదు. రాష్ట్రంలో అవసరానికి మించిన రైతులు పురుగుల మందులు వాడుతున్నారని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పురుగుల మందుల ప్రభావాన్ని తగ్గించి పంటలను పండించడమెలా? అనే అంశాన్ని పరిశీలించడానికి తగిన ల్యాబ్‌లకు కూడా లేదు. రైతు పండించిన దన్యాన్ని నిల్వ చేసుకునేందుకు గోడౌన్ల సామర్థ్యం తక్కువగా ఉంది. పిషరీస్, సెరికల్చర్, పశుసంపద పెంచడం, ఉద్యానవనాలకు, యూనివర్సిటీలల్లో మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఆర్కేవీవై నిధులను వినియోగించాలి. దీంతోపాటు డెయిరీలను అభివృద్ధి చేయడానికి కూడా నిధులను ఉపయోగించాల్సింది. దీంతో వ్యవసాయ ఫలాలు రైతులకు అందించడానికి ఈపథకం రూపకల్పన చేసింది. ఈ నిధులను ఖర్చు చేసి వాటిని కేంద్రానికి సమర్పించాలి. ఆ తర్వాతనే ఆర్కేవీవై కింద కేటాయించిన నిధులను విడుదల చేస్తున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను వ్యవసాయానికి ఖర్చు చేయకుండా దారి మళ్లించినట్టు తెలిసింది. అందుకే వీటన్నింటి కోసం ప్రతి ఏటా లెక్క ప్రకారం నిధులు వస్తాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం 2015-16, 2016-17, 2017-18 సంవత్సరాలకు గాను కేంద్రానికి లెక్కలు సమర్పించకపోవడంతో వ్యవసాయ శాఖకు రావాల్సిన నిధులు రావడం లేదు. 2019-20 సంవత్సరానికి నిధులు విడుదల కావాల్సి ఉంది. దీంతో రూ 500 కోట్లు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి.
దారి మళ్లిన ఆర్కేవీవై నిధులు
