హైదరాబాద్ : హైదరాబాద్ యూనివర్శిటీలో మరోసారి నిరసనలు మిన్నంటాయి. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తాత్కాలికంగా నిర్మించిన 'వెలివాడ'ను యూనివర్శిటీ పరిపాలన యంత్రాంగం ఆదివారం తొలగించడంతో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ తాత్కాలిక నిర్మాణంలో కుల వివక్షతపై పోరాడిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్, పెరియార్, అయ్యంకళి, సావిత్రిబాయి, జ్యోతిరావు పూలే తదితరుల చిత్రాలను పొందుపరిచారు. ఈ వెలివాడను ధ్వంసం చేయడంతో 200 విద్యార్థులు తమ మనోభావాలను దెబ్బతీశారంటూ పరిపాలన యంత్రాంగానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యూనివర్శిటీ విద్యార్థులైన రోహిత్ వేములతో పాటు మరో నలుగురు హాస్టల్ నుండి సస్పెండ్ చేయడంతో ఈ తాత్కాలిక నిర్మాణం చేపట్టి అక్కడి నుండి నిరసనలు తెలిపిన సంగతి తెలిసిందే.
హైదరాబాద్ యూనివర్శిటీలో మరోసారి విద్యార్థుల నిరసనలు
