ప్రజాశక్తి - హైదరాబాద్ బ్యూరో
ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో పెనుగొండ సుబ్బారాయుడు గెలుపొందారు. ఆదివారం హైదరాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో జరిగిన ఈ ఎన్నికల్లో నెల్లూరు డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్పై విజయవా డకు చెందిన సుబ్బారాయుడు 373 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. సుబ్బా రాయుడుకు టిడిపి మద్దతు పలకగా, ద్వారకానాధ్కు ప్రతిపక్ష వైసిపి మద్ద తు పలికింది. రాష్ట్రవ్యాప్తంగా 1300 మంది ఆర్యవైశ్యులకు ఓటు హక్కు ఉండగా, 86శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా సుబ్బారాయుడు
