ప్రజాశక్తి - హైదరాబాద్:
మంచిర్యాల జిల్లా మందమర్రి మండల శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన నకిలీ 2.60 క్వింటాళ్ల పత్తి విత్తనాలను టాస్క్ఫోర్స్ పోలీసు లు పట్టుకున్నారు. టాస్క్ఫోర్స్ ఏసీపీ విజయసా రథి ఇచ్చిన సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ సీఐ బుద్దె స్వామి బందం సాయంత్రం దాడులు చేయగా, సుమారు 35 కిలోల లూజు విత్తనాలు, 450 ప్యాకెట్లు రైంబో, అరుణోదయ కంపనీల పేరు గల విత్తనాలు పట్టుకున్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 5,20,000 రూపాయలు ఉంటుందన్నారు. మందమర్రి పట్టణానికి చెందిన జానీ, ఏపీలోని గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన ఆంజనేయులు అనే ఇద్దరు వ్యక్తులు ఇతర రాష్ట్రాల నుంచి నిషేధిత బీటి3 పత్తి విత్తనాలను తీసుకొచ్చినట్లు తెలిపారు. నిందితులను మందమర్రి పోలీసు లకు అప్పగించినట్లు ఆయన తెలిపారు.
నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
