ప్రజాశక్తి - తెలంగాణ
పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఈ రోజు కడియం శ్రీహరి హయాంలో ఫలితాలను విడుదల చేశారు. ఈ పదవ తరగతి పరీక్షలు 25.03.2015 నుండి 11.04.2015వరకు నిర్వహించబడినది. స్పాట్ వాల్యుయేషన్ తేది 11.04.2015 నుండి 25.05.2015 వరకు నిర్వహించడం జరిగింది. యస్ యస్ సి మార్చి 2015కు 5,64.901 మంది పరీక్ష వ్రాయుటకు నమోదు చేశారు.
- రెగ్యులర్ మరియు ప్రైవేట్ విద్యార్థులు మొత్తము కలుపుకొని 5,59,223 మంది విద్యార్థులు యస్ యస్ సి మార్చి 2015 పరీక్షలకు హాజరైనారు.
- గత సంవత్సరము 5,86,113 మంది విద్యార్థులు హాజరైనారు.
- మొత్తము 559223 విద్యార్థులలో 513473 మంది రెగ్యులర్ విద్యార్థులు కొత్త సిలబస్ తో పరీక్షలు వ్రాయగా 45,750 మంది విద్యార్థులు ప్రైవేటుగా హాజరైనారు.
- రెగ్యులర్ విద్యర్థులలో 3,98,267 మంది ఉత్తీర్ణులు కాగా ప్రైవేటులో 24,766 మంది ఉత్తీర్ణులు అయ్యారు.
- ఈ సంవత్సరము రెగ్యులర్ విద్యార్థులలో 14,083 మంది అధికం కాగా, ప్రైవేటు విద్యార్థులలో 30,067 మంది తగ్గినారు.
రెగ్యులర్ విద్యార్థులు
- రాష్ర్టంలో పదవ తరగతి రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతము 77.56
- బాలురు సాధించిన ఉత్తీర్ణతా శాతము 76.11 బాలిక ఉత్తీర్ణతా శాతము 79.04
- బాలికలు, బాలుర కంటె 2.93 ఉత్తీర్ణతా శాతము తో అధిక్యత సాధించారు.
ప్రైవేటు విద్యార్థులు
- రాష్ర్టములో ప్రైవేటు విద్యార్థుల ఉత్తీర్ణతా శాతము 54.13
- బాలుర ఉత్తీర్ణతా శాతము 51.17 కాగా బాలికల ఉత్తీర్ణతా శాతము 60.32
- బాలుర కంటే బాలికలే 9.15 శాతము అధికము సాధించారు.
రెగ్యులర్ విద్యార్థులు
- ఈ సంవత్సరము 14,91 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించినవి.
- ఈ సంవత్సరము 28 పాఠశాలలు సున్నా శాతము ఫలితాలు పొందాయి.
- రాష్ర్టంలో వరంగల్ జిల్లా అన్ని జిల్లాల కంటే 91.6 శాతము ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానములో ఉన్నది. అదే విధముగా రాష్ర్టములో ఆదిలాబాద్ జిల్లా అన్ని జిల్లాల కంటే అతి తక్కువ శాతము అనగా 54.9 శాతము సాధించి చివరి స్థానములో ఉన్నది.
- తెలంగాణ గురుకుల విద్యా సంస్థ పాఠశాలల విద్యార్థులు 92.99 శాతముతో ఉత్తీర్ణులైనారు.
- ప్రభుత్వ పాఠశాలలు 63.39 శాతముతో వెనుకబడి ఉన్నారు.
- జిల్లా పరిషత్, మున్సిపల్, టి డబ్ల్యుా ఆర్ ఇ ఐ ఎస్ మరియు ఎయిడెడ్ పాఠశాలలోని విద్యార్థులు రాష్ర్ట సరాసరి ఉత్తీర్ణతా శాతము కన్న తక్కువ ఉత్తీర్ణతా సాధించినారు.
గమనిక : - ఈ సంవత్సరము మార్చి 2015 రెగ్యులర్ విద్యార్థుల ఉత్తీర్ణతా శాతము 77.56. ఐతే గత సంవత్సరము ఉత్తీర్ణతా శాతము 85.77. అనగా ఈ సంవత్సరము ఉత్తీర్ణతా శాతము 8.21 శాతము మేరకు తగ్గినది.
బాలికలదే జోరు
