* సంతాపం తెలిపిన మాజీమంత్రి ఎన్.అమరనాథ్ రెడ్డి
ప్రజాశక్తి - పెద్దపంజాణి: మండలంలోని కోగిలేరు పంచాయతీ సీనియర్ టిడిపి నాయకులు చెంగప్ప శుక్రవారం అకస్మాత్తుగా మృతి చెందారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎన్.అమరనాథ్ రెడ్డి ఆయన మృతికి నివాళులు అర్పించారు. నిస్వార్థ గల నాయకులు, పార్టీ అభివృద్ధికి కృషి చేసిన వ్యక్తి చెంగప్ప అని అన్నారు. ఆయన మృతి టిడిపికి తీరని లోటని, మృతికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మురళీకృష్ణ, చెంగ రెడ్డి, మాజీ సర్పంచ్ శివయ్య, హరినాథ్ పాల్గొన్నారు.
టిడిపి నాయకుడు చెంగప్ప మృతి
