* కార్పొరేట్ నాచురల్ బ్యూటీ శ్ప ప్రారంభాన్ని నిరసిస్తూ.. కుప్పంలో నాయిబ్రాహ్మణుల ఆందోళన
* తమ ఉపాధి పోతుందని నాయిబ్రాహ్మణుల ఆవేదన
* ఆందోళనకారులను అరెస్ట్ చేసిన పోలీసులు
* పోలీసుల బందోబస్తు నడుమ అట్టహాసంగా నాచురల్ బ్యూటీ శ్ప ప్రారంభం
తిరుపతి : 'మా పొట్ట కొట్టకండి' అంటూ.. కుప్పంలోని నాయి బ్రాహ్మణులంతా శుక్రవారం ధర్నా చేపట్టారు. నాయిబ్రాహ్మణులు మాట్లాడుతూ.. కుప్పంలో నూతనంగా కార్పొరేట్ హంగులతో విలాసవంతమైన నాచురల్ బ్యూటీ శ్ప ని ప్రారంభిస్తే మిగిలిన వందలాది సెలూన్ షాపులు మూతపడటమేగాక తమ ఆదాయ వనరులను దెబ్బ తీయడంతో పాటు తమ వంశపారంపర్యమైన వృత్తిని కోల్పోవాల్సి వస్తుందన్నారు. స్టడీ సర్కిల్ ముసుగులో ఇలాంటి పనులు చేయడం తగదన్నారు. ఇందులో ముఖ్యంగా కటింగ్ కానీ షేవింగ్ లాంటివి చేయకూడదని చెప్పారు. యూనియన్ వారికి కూడా తెలియకుండా కార్పొరేట్ హంగులతో తీర్చిదిద్దిన నాచురల్ బ్యూటీ షా హీరోయిన్ తో ఓపెనింగ్ చేయడాన్ని నిరసిస్తూ.. రజక సంఘాలు, నాయిబ్రాహ్మణులు, సెలూన్ షాప్, యజమానులు ఏకమై ధర్నా చేశారు. వీరికి మద్దతుగా ఎక్స్ జడ్పిటిసి రాజ్ కుమార్, బిజెపి కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి శాంతారామ్, టిడిపి నాయకులు, ఇతరులు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. పోలీసు టీజీ నాయుడు ఆధ్వర్యంలో నాయి బ్రాహ్మణులు, కటింగ్ షాప్ ఓనర్ లను పోలీస్ కానిస్టేబుల్స్ అతి బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. తరువాత నేచురల్ బ్యూటీ శ్ప ను అట్టహాసంగా ఓపెన్ చేశారు. పూర్తిగా పోలీసుల ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నడుమ అట్టహాసంగా నేచురల్ సెలూన్ షాప్ ఓపెన్ చేయడాన్ని రజక సంఘాలు, నాయిబ్రాహ్మణుల, సెలూన్ షాప్ ఓనర్ లు, టిడిపి నాయకులు, తప్పుపట్టారు. ఒక సందర్భంలో.. బిల్డింగ్ ఓనర్ మాజీ సర్పంచ్ టిడిపి నాయకులు, వెంకటేష్ అక్కడికి రావాలి అంటూ నినాదాలు చేశారు.