* అమెరికాకు చైనా డిమాండ్
బ్యాంకాక్: దక్షిణ చైనా సముద్రంలో కొనసాగిస్తున్న కవ్వింపు చర్యలకు తక్షణమే తెరదించాలని చైనా అమెరికాను డిమాండ్ చేసింది. అమెరికా రక్షణశాఖ దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో విమానవాహక నౌకను మోహరించి దానిపై సైనిక విన్యాసాలు కొనసాగించటంపై తీవ్రంగా ప్రతిస్పందించిన చైనా రక్షణశాఖ ప్రతినిధి వు కియాన్ సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ద.చైనా సముద్ర ప్రాంతంలో బల ప్రదర్శనకు వెంటనే తెరదించాలని, ఉద్రిక్తతలను రెచ్చగొట్టే కవ్వింపు చర్యలు మానుకోవాలని కోరుతున్నట్లు చెప్పారు. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో అమెరికా నౌకాదళ ఉనికిని, తమ అంతర్గత వ్యవహారాలలో జోక్యంగా మాత్రమే కాక జాతీయ ప్రయోజనాలకు విఘాతంగా తాము పరిగణిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆసియాన్ దేశాల కూటమితో కలిసి అమెరికా ఇటీవల ద.చైనా సముద్ర ప్రాంతంలో తొలిసారిగా సైనిక విన్యాసాలు నిర్వహించిన విషయం తెలిసిందే.
కవ్వింపు చర్యలకు తక్షణమే తెర...!
