సూర్యాపేట: ఆత్మకూరు (ఎస్) మండలం కందగట్ల గ్రామంలో ఓ ఇంట్లో గ్యాస్లీకై మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దండెంపల్లి ఎల్లమ్మ(40) అనే మహిళ సజీవదహనం అయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పోస్టు మార్టం నిమిత్తం మృత దేహాన్ని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
గ్యాస్లీకై చెలరేగిన మంటలు.. మహిళ సజీవదహనం
