విశాఖపట్నం : విశాఖ బీచ్ రోడ్డులో ‘వైజాగ్ నేవీ మారథాన్’ ఆదివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది. 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, 21 కిలో మీటర్లు ఆఫ్ మారథాన్, 10 కి.మీ, 5 కి.మీ నాలుగు విభాగాల్లో ఈ మారథాన్ నిర్వహిస్తున్నారు. ఫుల్ మారథాన్ 42 కిలోమీటర్లు పరుగును ఐఎన్ఎస్ కళింగ ప్రధానాధికారి కమాండర్ రాజేష్ దేవనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ మారథాన్లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.75 వేలు, రెండో బహుమతి రూ.50 వేలు మూడో బహుమతి రూ.25 వేలు అందజేయనున్నారు. ఈ మారథాన్లో రాష్ట్ర నలుమూలల నుంచి 18 వేల మంది క్రీడాకారులు, నేవీ సిబ్బంది, పోలీసులు పాల్గొన్నారు.
