* ఆకట్టుకున్న విద్యార్థుల వేషధారణలు
రాజోలు : పండిత్ జవహర్లాల్ నెహ్రూ 129 వ జయంతిని పురస్కరించుకొని.. గురువారం రాజోలు మండలం, సోంపల్లి గ్రామంలోని చిల్డ్రన్స్ స్కూల్ లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల చిన్నారులు వేసిన నెహ్రూ వేషధారణలు చూపరులందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా కరెస్పాండెంట్ అయ్యప్పనాయుడు మాట్లాడుతూ.. నెహ్రూ జీవిత విశేషాలను విద్యార్థులకు వివరించారు. దేశ నాయకులను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ వారి బాటలోనే నడవాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణను అలవర్చుకుని, ప్రతీ ఒక్కరూ దేశానికీ సేవ చేసే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రామిరెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గన్నారు.



