శ్రీకాకుళం : ఎసిబి వలలో మరో అధికారి చిక్కారు. రూ.20 వేలు లంచం తీసుకుంటూ శ్రీకాకుళం జిల్లా ఇంటర్మీడియట్ ఆర్ఐఓ రమణారావు మంగళవారం ఎసిబి అధికారులకు పట్టుబడ్డారు. ప్రైవేటు కళాశాల అటెండెన్స్ అనుమతులకు రూ.20 వేలు లంచం పుచ్చుకుంటుండగా ఎసిబి అధికారులు కార్యాలయంపై దాడులు జరిపి ఆర్ఐఓ రమణారావును పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎసిబి వలలో ఇంటర్మీడియట్ ఆర్ఐఒ రమణారావు
