ఢిల్లీ : మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ.. గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ చేసిన సిఫారసుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ నేపథ్యంలో, సుప్రీం కోర్టును శివసేన ఆశ్రయించింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం మూడు రోజుల సమయం కావాలని అడిగినా గవర్నర్ తక్కువ సమయాన్ని ఇచ్చారంటూ పిటిషన్ వేసింది. బిజెపి కి 48 గంటల సమయాన్ని గవర్నర్ ఇచ్చారని, తమకు మాత్రం 24 గంటల సమయాన్ని మాత్రమే ఇచ్చారని తెలిపింది. బిజెపి కి అనుకూలంగా గవర్నర్ వ్యవహారశైలి ఉందని ఆరోపించింది. మరోవైపు శివసేన తరపున కాంగ్రెస్ నేత కపిల్ సిబాల్ సుప్రీం కోర్టులో వాదించనున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రపతి పాలనపై సుప్రీం కోర్టు మెట్లెక్కిన శివసేన
