తూర్పు గోదావరి : కాకినాడ మంత్రి కన్నబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడలోని భవన నిర్మాణ కార్మికులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ.. మంగళవారం మంత్రి కన్నబాబు ఇంటిని ముట్టడించారు. నిరసన తీవ్రరూపం దాల్చడంతో.. కాస్త ఉద్రిక్తత నెలకొంది. నిరసన స్థలానికి పోలీసులు మోహరించారు.

