* పెద్దఎత్తున చలో విజయవాడ కి తరలివెళ్లిన ఆశాలు
- పెద్ద ఎత్తున పోలీసులు రంగప్రవేశం..
- విజయనగరం రైల్వే స్టేషన్ లో పెద్ద ఎత్తున అరెస్టులు చేసిన పోలీసులు..
- రాయగడ ఏస్ప్రెస్ ఎక్కుతుండగా అడ్డుకున్న పోలీసులు..
- జిల్లా అధ్యక్షురాలు సుధారాణి, ఆశాలు అరెస్ట్..
- నిరసన తెలుపుతున్న మాపై ప్రభుత్వం ఇలాంటి చర్యలకి దిగడం దారుణం..
- ఇప్పటికే 500 వందలు మంది విజయవాడ తరలివెళ్లారు..
- ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తాం..
విజయనగరం: తమ డిమెండ్స్ నెరవేర్చాలి అని రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ అద్వర్యం లో చలో విజయవాడ కోసం ఆదివారం రాత్రి విజయనగరం రైల్వే స్టేషన్లో రాయగడ ఏస్ప్రెస్ ఎక్కడానికి 300 వందలు మంది ఆశా లు తరలివచ్చారు.. దింతో రైల్వే స్టేషన్ లో కోలాహలంగా మారింది..అయితే సమాచారం అందుకున్న విజయనగరం డిఎస్పీ వీరాంజనేయ రెడ్డి అద్వర్యం లో సిబ్బంది తో వచ్చి రైలు ఎక్కుతున్న జిల్లా అధ్యక్షురాలు సుధారాణి ని , కొంతమంది ఆశా లను అదుపులోకి తీసుకుని అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా సుధారాణి మాట్లాడుతూ..ఈ రోజున విజయవాడ వెళుతున్నారు అని తెలిసి అన్ని గ్రామాల్లో , పట్టణాల్లో ఉన్న ఆశా లు ఇంటికి వెళ్లి మరీ అరెస్టులు చేయడం దారుణం...గతం లో ఉన్న చంద్రబాబు కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదు. కానీ జగన్ వచ్చిన వెంటనే నిరసనలు అణిచివేసే పనిలో ఉన్నారు. పోలిసులు అండదండలు తో ఉదయం నుండి గ్రామంలో నిర్బంధం చేశారు. అధికారం లోకి రాగానే ఆశా వర్కర్స్ జితలు పై సంతకం పెట్టిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన దగ్గర నుండి ఆశా వర్కర్స్ 10 వేలు రూపాయలు జీతాలు ప్రకటించి గ్రేడింగ్ విధానం ప్రవేశపెట్టారు అని దీనికి A, B, C అని ప్రవేశపెట్టడం తో C గ్రేడింగ్ ఎక్కువ సార్లు వస్తే తొలగించే
ప్రకీయ చెప్పడతాం అని చెపుతున్నారు అని ఇలాంటీ గొరమైన నిర్ణయాలు చేసి ఆశా వర్కర్స్ ని వేధించడం కోసం జగన్ మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు అని విమర్శించారు. ఆశా వర్కర్స్ కి 7 నెలలు నుండి జితలు లేవు అని, ఎందుకు జితలు ఇవ్వడం లేదు అని మా ఆవేదన తెలపడనికి వెళుతుంటే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు అని తెలిపారు. జగన్ వస్తే ఎదో ఉద్దరిస్తారు అని అనుకుంటే మమ్మల్ని వేధించే పనిలో ఉన్నారు అని తెలిపారు. నయ్యమైన తమ డిమెండ్స్ నెరవేర్చకపోగా అన్నాయం చేస్తున్నారు అని తెలిపారు..వెంటనే పెండింగ్ బకాయిలు, గ్రేడింగ్ రద్దు చేయాలి డిమెండ్ చేశారు. ఈ ఉద్యమాలు ఆరంభం మాత్రమే , సమస్యలు పరిరష్కారం చేయకపోతే ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చాలా మందిని ఇప్పటికే రైలులో తరలించమని రేపు విజయవాడ ధర్నా ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగదు అని తెలిపారు..









