గుంటూరు : అనారోగ్య సమస్యలతో బాధపడలేక మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం వెలుగు చూసింది. తెనాలి ఐతానగర్లో నివాసముంటున్న కన్నెగంటి లక్ష్మీ పార్వతమ్మ గత (ఆదివారం) అర్థరాత్రి 2 గంటల సమయంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. అనారోగ్య సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
పెట్రోల్ పోసుకొని మహిళ ఆత్మహత్య
