గుంటూరు : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం తెనాలి అలోరా లాడ్జిలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న 3 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. మృతుడు గుంటూరు జిల్లా, చిన్నపలకలూరు గ్రామానికి చెందిన బాకిన రాజేష్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
