అమరావతి : పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎపి ప్రభుత్వం జారీచేసింది. మొత్తం రూ.4987.5 కోట్ల వ్యయంతో రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్ ఇచ్చింది. పోలవరం హెడ్‌వర్క్స్, పవర్ హౌస్ నిర్మాణానికి సంబంధించి ఈ నోటిఫికేషన్ జారీ అయ్యింది. లెఫ్ట్ కెనాల్లో 65వ ప్యాకేజీ కోసం రూ.270 కోట్లతో రివర్స్ టెండరింగ్‌కు వెళుతున్నారు. సోమవారం నుంచి ఈ నోటిఫికేషన్ వెబ్సైట్లో అందుబాటులోకి రానుందని అధికారులు వెల్లడించారు. ప్రాజెక్టు పనుల్లో అంచనాలు పెరిగిపోయాయన్న కారణంతో గుత్తేదారును ప్రభుత్వం ఇటీవలే తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేసింది.
రివర్స్ టెండరింగ్‌కు నోటిఫికేషన్ జారీ
