ముంబై : 4 రోజులుగా విరామం లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు ముంబై ను ముంచెత్తాయి. సిటీలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. మంగళవారం (నిన్న) దాదాపు 45 సెంటీ మీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధవారం, గురువారం కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. బిఎంసి, ఎన్డిఆర్ఎఫ్, నేవీ సిబ్బంది రంగంలోకి దిగి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. తిండి, నీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు.
ముంబై ను ముంచెత్తిన భారీ వర్షాలు
