- మద్యపాన నిషేధాన్ని నా స్వగ్రామం నుండే ప్రారంభిస్తా : ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి
తిరుపతి : మద్యపాన నిషేధాన్ని తన స్వగ్రామం నుండే ప్రారంభిస్తానని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. బుధవారం ఉదయం నారాయణ స్వామి తన స్వగ్రామమైన కార్వేటి నగరం పాదిరి కుప్పం లో పర్యటించారు. గ్రామంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం నారాయణ స్వామి మాట్లాడుతూ.. మద్యపాన నిషేధాన్ని తన స్వగ్రామం నుండే ప్రారంభిస్తానన్నారు. ఎవరి ఒత్తిళ్ళకు లొంగేది లేదని, బెదిరించినా భయపడనని, నిస్పక్షపాతంగా పని చేస్తానని చెప్పారు. ఎపి లో మద్యపాన నిషేధాన్ని విడతల వారీగా అమలు చేస్తామన్నారు. బెల్ట్ షాపులు, సారా విక్రయ కేంద్రాలపై దఅష్టి పెట్టామన్నారు. నవరత్నాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని నారాయణ స్వామి పేర్కొన్నారు.
స్వగ్రామంలో ఉప ముఖ్యమంత్రి పర్యటన
