ఢిల్లీ : దేశ వ్యాప్తంగా ఎన్నికల ఏర్పాట్లపై కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం విస్తృత చర్చ చేపట్టింది. ఈ చర్చలో కౌంటింగ్‌కు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మంగళవారం (నిన్న) ప్రతిపక్ష పార్టీలన్నీ ఇసి ని కలిశాయి. ముందుగా వివి ప్యాట్లను లెక్కించాలని, తర్వాత ఇవిఎం లను లెక్కించాలని ఇసి కి వినతి చేశాయి. తమకున్న అభ్యంతరాలను ఇసి కి వ్యక్తపరిచాయి. ప్రతి నియోజకవర్గంలోను 5 వివి ప్యాట్లు, 5 ఇవిఎం లను కౌంట్ చేసి, మొత్తం సరిసమానంగా వస్తే ఇక వేరే అభ్యంతరం లేకుండా మిగిలిన అన్ని పోలింగ్ కేంద్రాల్లోనూ ఇవిఎం ల సంఖ్యనే పరిగణనలోకి తీసుకొని అభ్యర్థుల గెలుపోటములు నిర్థారించవచ్చునని, కౌంటింగ్ లో ఏమాత్రం తేడా వచ్చినా.. ఆ నియోజకవర్గంలోని మొత్తం వివి ప్యాట్ల స్లిప్పులను లెక్కించి అనంతరం అభ్యర్థుల గెలుపోటములను ప్రకటించాలని 22 పార్టీల నేతలు ఇసి ని కోరారు. వివి ప్యాట్ స్లిప్పుల్ని మొదట్లోనే లెక్కించాలన్న విపక్షాల డిమాండ్ పై వివి ప్యాట్ల స్లిప్పుల లెక్కింపుపై కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని తీసుకోనుంది.
కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం
