యర్రగుంట్ల రూరల్ : 5.700 గ్రాముల బంగారం స్వాధీనపరుచుకున్నమని సీఐ బీవీ రమణ పేర్కొన్నారు. ఆదివారము ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబడిన సమాచారం మేరకు తెల్లవారు జామున 6 గంటలకు స్థానిక ప్రొద్దుటూరు రోడ్డులోని వై జంక్షన్ వద్ద తనిఖీలు నిర్వహించామన్నారు. ఈ తనిఖీల్లో స్కూటీ లో వెళుతున్న ఇద్దరు వ్యక్తులను తనిఖీ చేయగా ఒక వ్యక్తి వద్ద 100 గ్రాం బంగారు బిస్కెట్లు 35, మరో వ్యక్తి వద్ద 22 బంగారు బిస్కెట్లు ఉన్నాయన్నారు. ఈ బంగారు బిస్కెట్ లకు వారు ఎటువంటి ఆధారాలు గాని, రసీదులు గాని చూపకపోవడంతో ఇంకా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున స్వాధీనపరచుకున్నమని , తదుపరి చర్యల నిమిత్తం ఆదాయ పన్ను శాఖ వారికి అప్పగిస్తామన్నారు. ఈ బంగారు కు తగిన ఆధారాలను ఆదాయ పన్ను శాఖ వారికి చూపించి తిరిగి బంగారు పొందొచ్చని సలహా ఇచ్చామన్నారు. బంగారం విలువ మొత్తం రూ,, 1,86,96,000/-లని , చెన్నై నుండి తీసుకువస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు.